APPSC Pollution Control Board Notification 2023:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.గత కొన్ని రోజుల నుంచిగా వరుసగా ఏదో ఒక నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో 21 పోస్టులతో ఏపీపీఎస్సీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు వారికి తగిన వయసు మరియు పరీక్ష విధానం వంటి వాటిని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలు ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 21 పోస్టులు కలవు. పోస్ట్ NAME వచ్చేసి Assistant Environmental Engineer in A.P.
Pollution Control Board.
విద్యార్హతలు: ఈ ఉద్యోగానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే Civil/Mechanical/Chemical/Environmental Engineering లలో కచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు : ఈ ఉద్యోగాలకు కనిష్ట వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 42 సంవత్సరాలు ఉండాలి. బిసి, ఎస్సి, ఎస్టీ వంటి వారికి వయస్సు సడలింపు కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నందు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు పరీక్షలలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో ఓసి అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు, 35% ఎస్సీ ఎస్టీ వారు 30% ఉత్తీర్ణత సాధిస్తే వారు తదుపరి సెలక్షన్ ప్రక్రియకు ఎంపిక అవుతారు. పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు, అలాగే పరీక్ష కేంద్రాలను కూడా త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ వారు ప్రకటించారు .ఇక పూర్తి వివరాలకు ఈ క్రింద PDF పరిశీలించగలరు.