Eagle 2nd Song Update:
టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఒకే సంవత్సరంలో రెండు లేదా మూడు సినిమాలు విడుదల చేసే హీరో రవితేజ. ఇక ఇదే సంవత్సరం వాల్తేరు వీరయ్య, రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలతో అలరించిన రవితేజ తాజాగా వచ్చే సంవత్సరం మొదట్లోనే ‘ఈగల్’ అనే కొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన రవితేజ చాలా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే రవితేజ ఈసారి కూడా పోటీ భారీగా ఉన్నా కూడా తన సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సాధ్యంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం, వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. గతంలో ఈ చిత్రం నుండి మొదటి పాట ‘ఆడు మచ్చ ‘ విడుదల అవ్వగా ఆ పాట ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత విడుదలైన ఈగల్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులలో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో రవితేజ మునుపేన్నడు కనిపించని విధంగా మంచి హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ తో ట్రైలర్ లో కనిపించారు.
అయితే మొదటి పాట మాస్ ని విపరీతంగా ఆకట్టుకోగా , తాజాగా విడుదల అవుబోయే’ గల్లంతే’ అనే రెండవ పాట మంచి రొమాంటిక్ సాంగ్ గా ఉండనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన పోస్టర్స్ లో తెలుస్తోంది. ఇక ఈ చిత్ర రెండో పాటను ఈ నెల డిసెంబర్ 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ చిత్రం వచ్చే సంవత్సరం 2024 వ తేదీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.