Salaar Movie 1st day Collections: మొదటిరోజు భారీ వసూళ్లు సాదించిన ప్రభాస్ సలార్ చిత్రం…

Salaar Movie 1st day Collections

Salaar Movie 1st day Collections

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా , పృథ్విరాజ్ మరియు హీరోయిన్ శృతిహాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సలార్. ఇక ఈ చిత్రం డిసెంబర్ 22 తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం శుక్రవారం అర్ధరాత్రి నుండే షోలు ప్రారంభమయ్యాయి చాలా చోట్ల. ఇక విడుదలైన అనంతరం ఈ చిత్రానికి అటు క్రిటిక్స్ మరియు అభిమానుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కింది.

ఇక విపరీత అంచనాలు ఉన్న ఈ చిత్రం రిలీజ్ ఒక్కరోజు ముందే దాదాపు 30 లక్షల పైన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక్క ప్రీ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం దాదాపు 95 కోట్ల పైన వసూళ్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కెరియర్ లో బాహుబలి చిత్రం తర్వాత అత్యంత భారీ స్థాయి వసూళ్లు సాధించే చిత్రంగా ఈ సలార్ చిత్రం నిలవనుంది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలు సాహూ ,రాదే శ్యాం ,ఆదిపురుష్ వంటి చిత్రాలు అభిమానులను అంతగా మెప్పించకపోయినప్పటికీ ఈ సలార్ చిత్రం అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు సినీ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది.

ఇద్దరు స్నేహితుల మధ్య సాగే చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం పార్ట్ 2 పై అంచనాలు పెంచే విధంగా అయితే ముగింపు పలికారు. అయితే ఇక తాజా విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సలార్ చిత్రం 175 కోట్ల పైన మొదటి రోజు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్ కూడా తోడు అవడంతో మరింత భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *