ఉత్తమ తెలుగు జాతీయ చిత్రంగా నిఖిల్ “కార్తికేయ 2”

national awards telugu winners

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో మన తెలుగు చిత్రం కూడా నిలిచింది. ఇక యువ హీరో నిఖిల్ హీరోగా” కార్తికేయ 2″ చిత్రం 2022వ సంవత్సరంలో వచ్చి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలియనిది కాదు. పెద్దగా అంచనాలు లేకుండా పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్ల అద్భుతంగా ప్రదర్శింపబడింది.

ఇక నార్త్ సైడు ఈ చిత్రం ఊహించని కలెక్షన్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద సినిమాగా నిలిచింది. ఇక ఇందులో అనుపమ్కేర్ ఓ సన్నివేశంలో శ్రీకృష్ణుని గురించి చెప్పే మాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

మరి అలాంటి ఈ చిత్రం ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల లిస్టులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాని చందు మొండేటి దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వర హీరోయిన్గా నటించారు. గతంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన శతమానం భవతి చిత్రం కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *