SBI భారీ ఉద్యోగాల నోటిఫికేషన్, 8773 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు, అప్లై కి చివరి తేదీ ఇదే.

SBI CLERK POSTS 8773 POSTS IN TELUGU

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 16, 2023 తేదీ నాడు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మొత్తం 8773 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు తమ అప్లికేషన్ను 17 నవంబర్ 2023 తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BANK NAMESTATE BANK OF INDIA
POST NAMEJUNIOR ASSOCIATES[CUSTOMER SUPPORT AND SALES]
NO OF POSTS8773
NOTIFICATION DATE 16 NOV 2023
SELECTION PROCESSPRILIMS AND MAINS
EXAM TYPEONLINE
SALARYBASIC PAY 19900/-
LAST DATE DEC 7, 2023

మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీలు;

తెలంగాణ రాష్ట్ర సర్కిల్లో మొత్తం 525 వరకు పోస్టులు ఉన్నాయి, ఎస్సీ అభ్యర్థులకు మొత్తం 84 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు మొత్తం 36 పోస్టులు, ఓ బి సి అభ్యర్థులకు మొత్తం 141 పోస్టులు,EWS అభ్యర్థులకు మొత్తం 52 పోస్టులు మరియు జనరల్ అభ్యర్థులకు మొత్తం 212 పోస్టులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్లో మొత్తం 50 పోస్టుల వరకు ఉన్నాయి, ఎస్సీ 8, ఎస్టీ అభ్యర్థులకు 3, ఓ బి సి అభ్యర్థులకు 13, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5, జనరల్ అభ్యర్థులకు 21 మొత్తంగా 50 పోస్టులు వరకు ఉన్నాయి.

ఎస్బిఐ క్లర్క్ దరఖాస్తు ధర;

SBI క్లర్కు పోస్టు కోసం దరఖాస్తు రుసుము, జనరల్/OBC/EWS అభ్యర్థులకు 750/-, మరియుST/SC/PWD క్యాటగిరి అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.

వయస్సు మరియు విద్యార్హత;

కనీస వయసు 20 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్ట వయసు 28 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ మరియు ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పిడి డబ్ల్యు డి[ జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్] అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితితో సడలింపు ఉంటుంది.

ఇక విద్యార్హత చూసుకుంటే తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో చెల్లుబాటు అయ్యే డిగ్రీ ని కలిగి ఉండాలి. ఇక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే.

SBI క్లర్క్ పరీక్ష విధానం

ఎస్బిఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వ్యవధి కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది. అలాగే వంద మార్కుల ప్రశ్నలను కలిగి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ కి సంబంధించి 35 ప్రశ్నలు మరియు రీజనింగ్ ఎబిలిటీకి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ కు ఎంపిక అవుతారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరీక్షా కేంద్రాలు

కాకినాడ, కడప ,భీమవరం, చీరాల ,కర్నూలు, గూడూరు, గుంటూరు, అనంతపురం, నంద్యాల, నెల్లూరు, నరసరావుపేట, రాజంపేట, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం ,తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కరీంనగర్ ,ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ వంటి పట్టణ కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.

WEBSITE AND NOTIFICATION; CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *