New youtubers mistakes
యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా తమ ఛానల్ విజయవంతం అవ్వాలని కోరుకుంటారు. కానీ చాలామంది కొత్తగా వచ్చినవారు వీడియోస్ ఎలా చేయాలి ,అలాగే వీక్షకులను ఎలా ఎంగేజ్ చేయాలి వంటి విషయాలు తెలుసుకోకుండా ఛానల్ మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతుంటారు. అయితే ఇక్కడ కొత్తగా వచ్చినవారు చేసే కొన్ని తప్పులు మేము ఇక్కడ చెప్పడం జరిగింది.
మీ వీక్షకులు ఎవరో తెలుసుకో లేకపోవడం
మీరు వీడియోలు చేసినప్పుడు వాటిని ప్రజలు చూడాలని కోరుకుంటారు. కానీ వ్యక్తులు ఇష్టపడే వీడియోల గురించి మీరు ఆలోచించకపోతే వారు మీ వీడియోలు చూడలేకపోవచ్చు. కొత్తగా వచ్చే యూట్యూబర్లు తమ వీక్షకులు ఎవరో తెలుసుకోవాలి. అంటే మీ వీక్షకులు ఏమి ఇష్టపడుతున్నారు మరియు వారు ఏ ప్రదేశం నుంచి మీ వీడియోలు చూస్తున్నారు, అలాగే ఏ వయసు వారు అనే విషయాలు మీకు తెలిస్తే వారికి ఇష్టమైన వీడియోలు చేసేలాగా మీరు డెవలప్ అవ్వచ్చు.
వేర్వేరు సమయాల్లో వీడియోలను అప్లోడ్ చేయడం
మీ ఛానల్ అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటే మీరు టైం సెన్స్ కచ్చితంగా పాటించాలి. అంటే తరచుగా ఒకే సమయంలో వీడియోలు పెట్టడం నేర్చుకోవాలి. కొంతమంది కొత్త యూట్యూబ్లో దీన్ని అస్సలు పట్టించుకోరు,వారికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకే సమయంలో వీడియోలు పోస్ట్ చేసినట్లయితే వీక్షకులు వారికి నచ్చిన సమయంలో వచ్చి మీ వీడియోలు చూడడం జరుగుతుంది.
వీడియోలు నాణ్యత లేకపోవడం
మీరు చేసే వీడియోలు అస్పష్టంగా లేదా చీకటితో కూడుకొని ఉంటే,ప్రేక్షకులు ఎప్పుడు మీ ఛానల్ వీడియోలు చూడడానికి అసలు ఇష్టపడరు. వీడియో ఓపెన్ చేసిన వెంటనే వారు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. దీని నుంచి మీరు బయటపడాలి అంటే ఒక మంచి కెమెరా మరియు ఒక మంచి లైటును ఉపయోగించాలి. దాని వలన మీ వీడియోలు స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా కనిపించేలా ఉంటాయి.ఇలాంటి వాటిని ప్రజలు ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు.
వీడియోలు ఎడిటింగ్ చేయకపోవడం
ఎడిటింగ్ అంటే ముందుగా మీరు తీసిన వీడియోను కొంచెం ఎఫెక్ట్స్ మరియు కొంచెం మెరుగ్గా మార్చడం లాంటి ఒక ప్రక్రియ. కొంతమంది కొత్త యూట్యూబర్లు తమ వీడియోలను అస్సలు ఎడిట్ చేయరు. కానీ ఎడిట్ చేయడం వల్ల మీ వీడియోలు చూడడానికి చాలా సరదాగా మరియు చాలా ఇంపాక్ట్ చూపే విధంగా ఉంటాయి. వీడియోలు మీరు చేసిన తప్పులను ట్రిమ్ చేయవచ్చు. మీరు చెప్పాలనుకున్న మంచి విషయాలను కూడా జోడించవచ్చు. వీడియోలను ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకోవడం,పెద్ద కష్టమైన పని కాదు దీనికి kinemaster లాంటి యాప్స్ వంటివి చాలా ఉన్నాయి.
5.కీ వర్డ్స్ ఉపయోగించడం
మనం సాధారణంగా ఇంటర్నెట్లో ఏదైనా వెతకాల్చి వచ్చినప్పుడు, కొన్ని పదాలను ఎంటర్ చేస్తాము. యూట్యూబ్ లో కూడా వీడియోలకు కొన్ని పదాలు చాలా అవసరం వీటిని కీ వర్డ్స్ అని కూడా అంటారు. ఈ కీ వర్డ్స్ మీ వీడియోలను కనుగొనడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కొత్త యూట్యూబర్స్ కీ వర్డ్స్ ను అస్సలు వాడరు. టైటిల్ మరియు డిస్క్రిప్షన్ మరియు వాడకపోవడం కూడా ఒక తప్పు. ఇలా చేయడం వల్ల వారి యొక్క వీడియోలు యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్ లో రావడం చాలా కష్టం అవుతుంది.
6.ఎక్కువ గా మాట్లాడటం
ఈరోజుల్లోని ప్రజలకు ఓపిక చాలా తక్కువ.కొంతమంది యూట్యూబ్లో ఏం చేస్తారు అంటే, వీడియో అసలు మేటర్ మొదలవక ముందే మొదట్లోనే చాలా విసిగించే ప్రసంగాలు చేస్తారు.దానివల్ల వెంటనే క్లిక్ చేసి వెళ్లిపోవచ్చు. అందుకే వీడియో మొదలైన వెంటనే ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు విషయాలు చెప్పండి లేదా టీజర్ వంటివి క్రియేట్ చేయండి.
7.Thumbnails and Tittles
వ్యక్తులు మొదటగా చూసేది మీ thumbnails మరియు మీ టైటిల్స్ మాత్రమే, అవి బాగా లేకపోతే వ్యక్తులు మీ వీడియో పై క్లిక్ చేయకపోవచ్చు. కాబట్టి thumbnails చాలా బాగా క్రియేట్ చేయండి. మీ వీడియో దేనికి సంబంధించినదో చాలా బాగా తెలిపే టైటిల్స్ మాత్రమే వ్రాయండి. తప్పుడు టైటిల్స్ అస్సలు పెట్టవద్దు.
- YouTube analytics
అసలు మీ వీడియోలు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో మీ యూట్యూబ్ అనలిటిక్స్ చూసి తెలుసుకోవచ్చు. కొంతమంది కొత్త యూట్యూబర్లు ఈ అనలిటిక్స్ అస్సలు పట్టించుకోరు. మీ వీడియోలు ఇష్టపడుతున్నారు లేదో తెలుసుకోవడానికి ఈ analytics చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ వీడియో పనిచేస్తుందో మరియు ఏ వీడియో పనిచేయలేదు మీరు బాగా తెలుసుకోవచ్చు. దాని ద్వారా మీరు మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం కలుగుతుంది.
9.copy కొట్టడం
చాలామంది యూట్యూబ్లో సక్సెస్ కాలేకపోవడానికి కాపీ కొట్టడం. ఇతరుల కంటెంట్ మాత్రమే చూసి దాని నుండి మీ సొంతంగా కంటెంట్ తయారు చేస్తే పర్వాలేదు, కానీ డైరెక్ట్ గా వాళ్ళ వీడియోను కాపీ కొట్టడం ఏ మాత్రం మంచిది కాదు.
10.మీ అభిమానులతో మాట్లాడక పోవడం
వ్యక్తులు మీ వీడియోలు చూసినప్పుడు,సాధారణంగా వారు కామెంట్లు చేయవచ్చు. కొంతమంది కొత్త youtubers ఈ కామెంట్లకు అస్సలు రెస్పాండ్ కారు.వారికి కృతజ్ఞతలు చెప్పడం లేదా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వ్యక్తులకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వలన వారు మరి తిరిగి మీ ఛానల్ కు రావచ్చు