YOUTUBE లో NEGATIVE COMMENTS ని ఎలా తట్టుకోవాలి

YOUTUBE లో NEGATIVE కామెంట్స్ ని ఎలా తట్టుకోవాలి

Youtubers  ఎంత సక్సెస్ అయినప్పటికీ వారికి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. వాటిలో ప్రధానంగా నెగిటివ్ కామెంట్ అండ్ trolls. ఈ ట్రోల్స్ అనేవి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని చర్యలుగా భావించవచ్చు. అయితే కంటెంట్ క్రియేటర్ గా ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని ముందుకు పోవడం చాలా అవసరం. మరైతే ఇక్కడ వాటిని ఎలా అధిగమించాలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరుగుతుంది.

 

  1. ప్రశాంతంగా ఉండండి

 

నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మొదట్లో చాలా బాధగా లేదా నిరాశగా ఉండవచ్చు. అయినప్పటికీ ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ప్రతి వీక్షకుడు కూడా వారి సొంత ప్రాధాన్యతలతో వస్తారు మరియు ప్రతి ఒక్కరూ కూడా మీ కంటెంట్ను సమానంగా అభినందించరు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిపై మీరు కూడా కోపంతో ప్రతిస్పందించడం, పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తుంది.కాబట్టి ఇది అనవసరమైన వివాదాలకు కూడా దారి తీస్తుంది.అలాంటి వారిని అలా వదిలేయండి.

 

2.Comment గురించి ఆలోచించండి.

 

కామెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి.కొందరు నిర్మాణాత్మక విమర్శలను కూడా చేస్తారు. అంటే అది మీ మంచి కోసమే అని మీరు గమనించాలి. దాని ద్వారా మీ కంటెంట్ను మరింత నాణ్యతతో చేయడానికి ఉపయోగపడుతుంది. వారు చేసే కామెంట్లు మీకు ఉపయోగపడి, ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నట్లయితే దానిని మీరు భవిష్యత్తులో వీడియోలలో ఎలా చేర్చవచో పరిశీలించండి. అంతేకానీ మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశంతో చేసిన కామెంట్స్ ను అసలు పట్టించుకోకండి.

 

3.Trolles నీ పట్టించుకోకండి.

 

Trolles అనేవి చాలా రకాలుగా ఉంటాయి కొన్ని మిమ్మల్ని నవ్వించడానికి చేసేవి అయితే ,మరికొన్ని మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టడానికి చేసేవి.

Trolls అంటే ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధించేలా లేదా మీ వీక్షకులను బాధించేలా చేసే వ్యాఖ్యలని పరిగణించవచ్చు. ట్రోల్స్ ని నివారించడానికి ఉన్న ఉత్తమ మార్గం ఏంది అంటే వారితో మాట్లాడకపోవడమే. మీరు వారికి స్పందిస్తే వారు మీ దృష్టిని ఆకర్షించినందున వారు గెలిచినట్లు భావిస్తారు. కాబట్టి వారు చేసే పనులను విస్మరించి, మీ నిజమైన వీక్షకుల నుండి వచ్చిన మంచి కామెంట్స్ మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

 

4.Block లేదా Delete చేయండి

 

ఒక కంటెంట్ క్రియేటర్ గా మీ కామెంట్స్ ను నిర్వహించడానికి మీకు కొన్ని ఉపయోగకరమైన పద్ధతులు కూడా ఉన్నాయి. మీ వీడియోలకు ఇబ్బందికరమైన కామెంట్లు పెట్టే యూజర్స్నీ బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే మిమ్మల్ని బాగా బాధ కలిగించే కామెంట్ చేసే వాళ్ళ కామెంట్స్ ని, కూడా డిలీట్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది.

 

5.నేర్చుకుని ఎదగండి

 

నెగిటివ్ కామెంట్స్ మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ లేదా నిరుస్తాహపరిచినప్పటికీ అవి మీ అభివృద్ధికి మూలం అవ్వొచ్చు. అయితే వాటిని మెరుగుపరచడానికి అవకాశాలుగా చూడండి. విమర్శ అనేది మీ కంటెంట్ను మెరుగుపరచడంలో మరియు మీ ప్రేక్షకులతో మరింత ప్రభావంతంగా కనెక్ట్ అవ్వడంలో మీకు ఎలా సహాయపడుతుందో పరిశీలన చేయండి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి అత్యంత విజయవంతమైన యూట్యూబర్స్ కూడా ఒకప్పుడు వారి ప్రయాణంలో ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న వారే అని గుర్తుంచుకోండి.

 

6.Report చేయవచ్చు

మీకు పదే పదే అభ్యంతరకరమైన లేదా బాధపెట్టే కామెంట్స్ ఎక్కువ అయినప్పుడు యూట్యూబ్ కొన్ని మార్గ దర్శకాలను కలిగి ఉంది. అంటే అటువంటి వ్యాఖ్యలను యూట్యూబ్కు మీరు రిపోర్ట్ చేయవచ్చు. యూట్యూబ్ అనుచితమైన కంటెంట్ను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *