YOUTUBERS ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదిస్తారు

HOW MANY WAYS TO EARN MONEY WITH YOUTUBE

యూట్యూబ్ అనేది కేవలం వీడియోలు చూసే ఒక ఆన్లైన్ ప్లాట్ఫారం మాత్రమే కాదు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే సమాచారాన్ని సృష్టించి మరియు భాగస్వామ్యం చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఒక వేదిక కూడా. అలాగని ప్రతి ఒక్కరూ సంపాదిస్తాము అంటే అవ్వదు. దానికి ఎంతో ఓర్పు సహనం మరియు పట్టుదల చాలా అవసరం. అలాంటి వారే సక్సెస్ అయ్యారు, అవుతారు కూడా. ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా క్రియేటర్స్ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారో తెలుసుకుందాం.

 

1.Adsence

మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు, వీడియో ముందు లేదా వీడియో మధ్యలో మీరు చూస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రకటనలు రావడం, మీరు చూసి ఉంటారు.యూట్యూబర్లు ఈ ప్రకటనల నుండి డబ్బు సంపాదిస్తారు.మీ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ప్రకటన దారులు వారి యొక్క ప్రకటనలకు, మీ వీక్షకులకు చూపించడానికి యూట్యూబ్కు కొంచెం అమౌంట్ చెల్లిస్తారు. అప్పుడు యూట్యూబ్ ఆ డబ్బులు కొంచెం డబ్బులు వీడియో క్రియేటర్స్ కి,తర్వాత కొంత సొమ్ము యూట్యూబ్ తీసుకుంటుంది. అయితే మనం ఇలా డబ్బులు సంపాదించాలి అంటే యూట్యూబ్లో కొన్ని నియమాలు ఉన్నాయి.అవి ఏమిటి అంటే ముందుగా మీకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి.తర్వాత మీరు పెట్టే వీడియోలు నాలుగువేల గంటల వాచ్ టైం కూడా కలిగి ఉండాలి.

 

2.Sponcership

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఉన్న మరొక మార్గం, ఏమిటి అంటే బ్రాండ్ స్పాన్సర్షిప్. అంటే కంపెనీలు వారి యొక్క ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబర్స్ ని సంప్రదిస్తారు. అంటే వారి యొక్క వీడియోలలో, కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమని అడుగుతారు అందుకుగాను యూట్యూబర్స్ కి కంపెనీలు కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తాయి.

 

3.membership and super

మెంబర్షిప్ అంటే మీకు మీ ఇష్టమైన కంటెంట్ క్రియేటర్కు నెలవారిగా డబ్బులు ఇవ్వాలి అనుకోవడం. మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీ క్రియేటర్ ఎ ప్పుడైనా యూట్యూబ్లో లైవ్ చేస్తున్నప్పుడు మీరు ప్రత్యేకమైన ఫీచర్లను పొందుతారు. అంటే ఎమోజీలు లేదా బ్యాడ్జిలు వంటి ప్రత్యేక perks పొందడానికి మీరు అర్హులు అన్నమాట. సూపర్ ద్వారా మీ కంటెంట్ క్రియేటర్ కి మీరు వీడియో నచ్చినట్లైతే కొంత మొత్తాన్ని కూడా పంపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా వారు డబ్బులు సంపాదిస్తారు.

 

4.Sell your own brand

కొంతమంది యూట్యూబర్లు తమ లోగోలు కలిగిన టీ షర్ట్లు మగ్గులు లేదా స్టిక్కర్స్ వంటి వాటిని అమ్ముతూ ఉంటారు. ఇది కూడా మీరు గమనించే ఉంటారు. లేదా కంటెంట్ క్రియేటర్లు ఏదైనా ఒక సొంత బ్రాండ్ ఉత్పత్తులు ఉన్నట్లయితే వాటిని కూడా వారు వ్యాపారంగా చేసుకోవచ్చు. అంటే వారిని ఇష్టపడే అభిమానులు కొనుక్కోవడం ద్వారా వారికి డబ్బులు రావడం జరుగుతుంది.

  1. YouTube premium

యూట్యూబ్ ప్రీమియం అనేది ఒక యాడ్ ఫ్రీ సర్వీస్, అంటే వీక్షకుడు ఎటువంటి ప్రకటనలు లేకుండా వీడియోలను చూసే అవకాశం కల్పించే ఒక ప్రత్యేకమైన ఫీచర్. ఎప్పుడైనా యూట్యూబ్ ప్రీమియం వ్యక్తి మీ వీడియోలను చూసినప్పుడు వారు మీ వీడియోతో ఎంతగా ఎంగేజ్ అయినారు అనే దాని ఆధారంగా, వారి సబ్స్క్రిప్షన్ అమౌంటు లో కొంత భాగాన్ని ఆ క్రియేటర్ కు ఇవ్వడం జరుగుతుంది. ఇది తక్కువే అయినప్పటికీ ఇది కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్.

 

6.Sell Your Course

మీకు ఏదైనా ఒక పనిలో మంచి పరిజ్ఞానం మరియు నైపుణ్యం ఉంటే మీరు మీ సబ్స్క్రైబర్లకు ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్ షాప్ లు లేదంటే ఈ బుక్స్ వంటి వాటిని కూడా తయారు చేసి వాటిని మీరు అమ్ముకోవచ్చు. అంటే ఇది మీరు మీకున్న స్కిల్ ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఒక మార్గమని అర్థం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *