Youtube లో ఎలా సక్సెస్ అవ్వాలి |best tips for success in Youtube

BEST TIPS FOR SUCCESS IN YOUTUBE

కంటెంట్ క్రియేటర్స్ తమ యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి లేదా వారి అభిరుచులను ఇతరులతో పంచుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కలెక్ట్ కావడానికి యూట్యూబ్ అనేది ఒక పవర్ హౌస్ ప్లాట్ఫారం. అయితే  ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నట్లయితే లేదా మరింత మంది వీక్షకులను ఆకట్టుకోవాలి,అనుకున్నట్లయితే మీకు ఉపయోగపడే కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ అయితే ఇక్కడ చర్చిద్దాము.

 

  1. మీ Niche కనుగొనండి.

ఇక్కడ niche అంటే మీకు దేనిలో ప్రావీణ్య ఉంది, మీరు దేని గురించి బాగా ప్రేక్షకులకు చెప్పగలరు అనేది మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. మీకు బాగా మక్కువ లేదా పరిజ్ఞానం ఉన్న niche సెలెక్ట్ చేసుకోవడం వలన మీరు యూట్యూబ్లో ప్రత్యేకంగా నిలబడగలుగుతారు. మీకు టెక్నాలజీ లేదా రివ్యూస్ లేదా మీకు ట్రావెల్ వంటి వాటి మీద మంచి పరిజ్ఞానం ఉంటే అటువంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీ కంటెంట్ పై ఆసక్తి ఉన్న వీక్షకులు,మీ ఛానల్ ను కనుగొని మీకు సబ్స్క్రైబ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.

 

  1. అత్యుత్తమ క్వాలిటీ కంటెంట్

యూట్యూబ్లో కంటెంట్ నాణ్యత చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. మీ వీడియోలు స్పష్టమైన విజువల్స్ మరియు స్పష్టమైన ఆడియోను కలిగి ఉండేలా చూసుకోండి .దానికి తగిన కెమెరా మరియు మైక్రోఫోన్ కొనుక్కోండి. మీ వీడియోలను ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసి వీడియోలు చేయడానికి ముందే తగినంత కంటెంట్ కు సంబంధించి మంచి స్క్రిప్ట్ రాసుకోండి. వీక్షకుల వాచ్ టైం పెంచే విధంగా మీ వీడియోలు బాగా ఎడిట్ చేసుకోండి.అధిక నాణ్యత గల కంటెంట్ ఎప్పటికీ వీక్షకులను ఆకర్షించడమే కాకుండా మరిన్ని వీడియోస్ కోసం వారు సబ్స్క్రైబ్ చేసుకునే లాగా మీ కంటెంట్ వారిని ప్రోత్సహిస్తుంది.

 

  1. సమయానికి అప్లోడ్ చేయడం

యూట్యూబ్ లో విజయం సాధించాలి అనుకుంటే టైం సెన్స్ కూడా చాలా అవసరం. అంటే మీ వీడియోలను వారానికి రెండు లేదా మూడు లేదా నెలకు 5 లేదా 6 అని మీరు ముందుగానే నిర్ణయించుకొని, అవి అప్లోడ్ చేసేలా చూసుకోండి. ఇలా మీరు టైం కు అప్లోడ్ చేయడం వలన మీ సబ్స్క్రైబర్లలో చాలామంది మీ రాబోయే కొత్త కంటెంట్ కోసం తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

 

  1. అద్భుతమైన Thumbnail డిజైన్స్

మీరు ఎప్పుడైనా ఒక బుక్ స్టాల్కు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పుస్తకాల కవర్ పేజీలు మీకు బాగా నచ్చినట్లయితే ,మీరు కచ్చితంగా ఆ బుక్ ని ఒక్కసారైనా తీసుకొని ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ లో కూడా అదే ఫార్ములా పనిచేస్తుంది. మీ thumbnail కచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా మీరు డిజైన్ చేసుకోవాలి. మీరు వీడియోలో ఏదైతే విషయం ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే థంబ్నెయిల్ పెట్టుకోండి. కంటెంట్ లోపల ఒకటి మీ thumbnail ఒకటి ఉంటే భవిష్యత్తులో మీ ఛానల్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది.

 

  1. వ్యూవర్స్ తో సరదాగా ఉండండి

యూట్యూబ్ లో విజయవంతం అవ్వడానికి మరొక ఉదాహరణ మీ సబ్స్క్రైబర్ల కామెంట్లకు తప్పకుండా స్పందించండి. దానిద్వారా వాళ్లు వాళ్ల అభిప్రాయాలకు మీరు విలువ ఇస్తున్నారని భావించి, మీతో మరింతగా ఎంగేజ్ అవుతూ ఉంటారు. సబ్స్క్రైబర్లతో కామెంట్లు వేయడానికి మరియు వారి ఆలోచనలు పంచుకోవడానికి మీ వీడియోలలో కొన్ని ప్రశ్నలను అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి.

 

  1. ఇతర చానళ్లతో Collaboration

ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు, ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ వేరొక వాళ్ళ యూట్యూబ్ యొక్క లింకును ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీనివలన వారికి ఉన్న సబ్స్క్రైబర్లు కూడా ఆ రెండవ చానల్లో కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా ఇతర యూట్యూబ్ ఛానల్లో వారితో సంప్రదించి మీ ఛానల్ ను వారి చానల్లో ప్రమోట్ చేసేలా వారిని అడగండి. అలా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటే రెండు చానల్స్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

 

  1. ఇతర సోషల్ మీడియా

మీ యూట్యూబ్ వీడియోలు ఎక్కువమందికి రీచ్ అవ్వాలి ,అంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మీ వీడియోస్ ని షేర్ చేయండి. ఉదాహరణకు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో కూడా వాటిని షేర్ చేయండి. ఇలా చేయడం వలన మీ వీడియోస్ ఎక్కువమందికి చేరేలా చేస్తుంది.

 

8.SEO

ఇక యూట్యూబ్ వీడియోలు సక్సెస్ అవ్వాలి అంటే ఎస్సిఓ కూడా అవసరమే. ఎస్ ఇ ఓ అంటే మీ యొక్క వీడియో టైటిల్ మరియు డిస్క్రిప్షన్ అలాగే మీ వీడియో రాంక్ అవ్వడానికి ఉపయోగపడే వంటి వాటిని సరైన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వలన ఎవరైనా మీ కంటెంట్ కు సంబంధించి వెతికినప్పుడు దానికి సంబంధించిన వీడియోలను సెర్చ్ రిజల్ట్ లో చూపడానికి అవకాశం ఉంటుంది.

 

  1. వేచి ఉండండి

ఏదైనా ఒక విషయంలో విజయం సాధించాలంటే మనకు చాలా ఓపిక సహనం అవసరం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకు ఒకేసారి వైరల్ అయితే అవ్వదు. యూట్యూబ్ అభివృద్ధి చెందడానికి మీకు కొంచెం సమయం పడుతుంది. మీకు వెంటనే తగిన ఫలితం రాకపోతే ఎక్కడ నిరుస్తాహపడకండి పట్టుదలతో ఉండండి మీ కంటెంట్ మీద దృష్టి పెట్టి అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *