Podupu Kathalu In Telugu|తెలుగు పొడుపు కథలు మరియు జవాబులు

Podupu Kathalu In Telugu

           1.ఆకాశంలో అంబు ,అంబులో  చెంబు,  చెంబులో చారడు నీళ్లు.

          సమాధానం; టెంకాయ

  1. వందమంది అన్నదమ్ములకు ఒకటే  మొల త్రాడు.

             సమాధానం; చీపురు కట్ట

  1. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.

              సమాధానం; కవ్వం

  1. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు.

              సమాధానం; ఉల్లిపాయ

  1. ఇంతింత నా బండి, ఇనుపకట్ల బండి .తొక్కుతే నా బండి 96 ఆమడలు పోతుంది.

            సమాధానం; సైకిలు

           6.తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులెరగా ఉండు, రాకాసి కాదు పాకి.     పోవుచుండును పాము కాదు ఏమిటది.

            సమాధానం; రైలు బండి

        7.ఇల్లంతా ఎలుక కన్నాలు.

         సమాధానం; జల్లెడ

  1. చేతితో పారేసి, నోటితో ఏరుతారు.

            సమాధానం: అక్షరాలు

  1. ఊరు అందరికీ ఒకటే దుప్పటి.

             సమాధానం: ఆకాశం

మరిన్ని పొడుపు కథలు కూడా చదవండి 

  1. ఎందరు ఎక్కిన విరగని మంచం.

            సమాధానం: అరుగు

  1. ఎంత మూసినా చప్పుడు కావు.

           సమాధానం: కనురెప్పలు

  1. తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది

          సమాధానం: ఉత్తరం

  1. ఎండిన బావిలో పిల్లలు గంతులు వేస్తారు.

           సమాధానం: మొక్కజొన్న పేలాలు

  1. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని  దొంగలు.

           సమాధానం: సీతాఫలం పండు.

           15.గూటిలో గువ్వ, ఎంత గుంజిన రాదు. అటు ఇటు కదులుతుంది.

            సమాధానం: నాలుక

           16.ఊరు అందరికీ ఒకటే దీపం.

            సమాధానం: సూర్యుడు

  1. కాళ్లు లేవుగాని నడుస్తుంది,కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది.

           సమాధానం: మేఘం

  1. ఆకు వేసి అన్నం పెడితే,ఆకు తీసేసి భోజనం చేస్తాం.

         సమాధానం: కరివేపాకు

  1. ఎక్కలేని దిగలేని మాను గంపెడు కాయలు   కాచు.

       సమాధానం: మిరప చెట్టు

  1. ఎర్రని పండు మీద ఈగైన వాలదు.

         సమాధానం: నిప్పు

Telugu podupu kathalu|పొడుపు కథలు మరియు జవాబులు

  1. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర.

         సమాధానం: కొవ్వొత్తి

  1. ఇంటిలోన మొగ్గ,బయటనేమో పువ్వు.

         సమాధానం: గొడుగు

  1. ఆ ఇంటికి ఈ ఇంటికిముక్కు మధ్య ఒకటే దూలo

        సమాధానం: ముక్కు 

  1. ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది.

         సమాధానం: అద్దం

  1. నల్ల కుక్కకు నాలుగు చెవులు.

        సమాధానం: లవంగం

  1. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.

        సమాధానం: సూది

        27.పొట్టలో  వేలు నెత్తిమీద రాయి.

        సమాధానం: ఉంగరం

  1. వాన లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆపు  లేక సున్నాలు లేక నోరు ఎర్రగా.

         సమాధానం: రామ చిలుక

  1. నేను అమ్మకు తమ్ముడిని కాను, కానీ మీకు నేను మేనమామను.

            సమాధానం: చంద మామ

  1. ఐదుగురిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు

           సమాధానం: చిటికెన వేలు

  1. ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయటికి వచ్చారు.

          సమాధానం: వేరుశనగకాయ

  1. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసిన వరదలు రావు.

           సమాధానం: కన్నీళ్లు

  1. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు.

           సమాధానం: కోడి గుడ్డు

  1. అమ్మ అంటే దగ్గరకు వస్తాయి. అయ్యా అంటే దూరంగా పోతాయి.

          సమాధానం: పెదవులు

  1. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది.

          సమాధానం: ఈత చెట్టు

  1. ఒకటే ఇంట్లో 60 మంది దొంగలు ఉంటారు.

           సమాధానం: అగ్గిపుల్ల లు

  1. ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి ,సిపాయికో తుపాకీ.

          సమాధానం: తేనె పట్టు

  1. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.

           సమాధానం: చీమలదండు

  1. ఆకాశాన కొడవళ్ళు వేలాడుతున్నాయి.

            సమాధానం: చింత కాయలు

Telugu podupu kathalu|పొడుపు కథలు మరియు జవాబులు

  1. ఆకాశంలో ఎగురుతుంది.పక్షి కాదు.మనుషుల్ని ఎగరేసుకొని పోతుంది గాలి కాదు.

            సమాధానం: విమానం

  1. పొట్టి వాడికి ఒళ్లంతా బట్టలే.

          సమాధానం: ఉల్లిపాయ

  1. ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది

          సమాధానం: దీపం

  1. కడుపునిండా రాగాలు,ఒంటినిండా  గాయాలు

         సమాధానం: మురళి

  1. సముద్రంలో పుడుతుంది, ఊరిలో కొచ్చి అరుస్తుంది

       సమాధానం: శంఖం

  1. ఆకులు లేని అడవిలో, జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది.

        సమాధానం: దువ్వెన

  1. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి.

         సమాధానం: పలక

  1. రాణి గారి తోటలో రోజా పూలు చూసే వారే గాని లెక్క పెట్టలేరు.

         సమాధానం: నక్షత్రాలు

  1. చీకటి ఇంట్లో జడలు దయ్య0

            సమాధానం: ఉట్టి

  1. ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి పుడతారు ఒకేసారి చనిపోతారు.

            సమాధానం: ఫ్యాన్

  1. ఇల్లు అంతా వెలుగు బల్ల కింద చీకటి.

            సమాధానం: దీపం

  1. చెయ్యని కుండ,పోయని నీళ్లు ,వెయ్యని సున్నం, తీయగా ఉండు.

          సమాధానం: టెంకాయ

  1. నాలుగు కాళ్లు ఉన్నాయి కానీ, జంతువునీ కాదు. రెండు చేతులు ఉన్నాయి కానీ, మనిషినే కాదు.

            సమాధానం: కుర్చీ

  1. ఒంటిపై చేయి వేస్తే కరువందే వదలదు.

          సమాధానం: నిప్పు

  1. ఒకటే సీసాలో రెండు రంగులు.

            సమాధానం: కోడి గుడ్డు

  1. గదినిండా రత్నాలు గదిలో తాళం.

          సమాధానం: దానిమ్మ పండు

  1. చుట్టమై చూడనీకి వస్తే దయమై పట్టుకున్నాడు.

          సమాధానం: రేగు చెట్టు

  1. సంత లన్ని తిరుగుతాడు సమానంగా పంచుతాడు.

           సమాధానం: తక్కెడ

  1. వేయి కళ్ళు కల ఇంద్రునికి చూపులేదు.

         సమాధానం: వల

  1. వెలేడు అంత తోడు, తాడిని కొట్టాడు.

         సమాధానం: గొడ్డలి

Telugu riddles with answers|తెలుగు పొడుపు కథలు మరియు జవాబులు

         61.వేప కాయంత బంగారాన్ని ఏనుగైనా మోయలేదు.

            సమాధానం: నిప్పు

  1. వెనుకకు పోకుండా ముందుకు పోయేది.

            సమాధానం: బాణం.

  1. వింత వింత బండి, ఎగిరిపోయే బండి ,మండుతూ మండుతూ మాయమయ్యే బండి.

             సమాధానం: సూర్యుడు

  1. లోతు బావిలో జిగురు బెల్లం.

               సమాధానం: గుబిలి

  1. రెండు కొండల మధ్య గంగానది పారుతుంది.

              సమాధానం: పాపిట

  1. మొదట నల్లదానిని, తర్వాత ఎర్రదానిని, ఆ తరువాత తెల్ల దానిని.

              సమాధానం: బొగ్గు

  1. మీ నాన్న మా నాన్న రెండు ఎద్దులు పట్టుకొస్తే కుడి ఎడమకు రాదు ఎడమ కుడికి రాదు.

            సమాధానం: చెప్పులు

  1. మీ మామయ్య మా మామయ్య ఒక్కరే.

            సమాధానం: చంద మామ

  1. మా తాత సంతకు వెళ్లి తుడిమెలేని వంకాయ తెచ్చాడు.

             సమాధానం: గుడ్డు

  1. నాకు గుండె ఉంది కానీ అది కొట్టుకోదు.

           సమాధానం: పేకాట కార్డ్

  1. అది మీదే కానీ, మీ కన్నా వేరే వాళ్ళే ఎక్కువగా వాడుతారు.

            సమాధానం: మీ పేరు

  1. నాలో ఎన్నో నగరాలు ఉంటాయి కానీ, ఇల్లులు ఉండవు. నాలో ఎన్నో అడవులు ఉంటాయి కానీ, చెట్లు ఉండవు.నాలో ఎన్నో నదులు ఉంటాయి కానీ, నీళ్లు ఉండవు.

           సమాధానం: మ్యాప్

  1. నాకు తలకాయ (head) ఉంటుంది కానీ బాడీ ఉండదు.

         సమాధానం: కాయిన్

  1. నా ఒళ్లంతా రంద్రాలే ఉంటాయి కానీ,నేను నీళ్లను ఒడిసి పట్టుకోగలను.

            సమాధానం: స్పాంజి

  1. నాకు రెక్కలు లేకపోయినా ఎగురుతాను ,కళ్ళు లేకపోయినా ఏడుస్తాను .నేను ఎవరిని?

             సమాధానం: మేఘం

  1. నన్ను తినడానికి కొంటారు కానీ,తినలేరు.

           సమాధానం: ప్లేట్

  1. నాకు ఒకటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను.

         సమాధానం: సూది

  1. నాకు నాలుగు కాళ్లు ఉంటాయి. కానీ నేను నడవలేను నేనెవరిని.

          సమాధానం: కుర్చీ

  1. పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు.

            సమాధానం: వయస్సు

  1. ఒక అరలో ముగ్గురు దొరసానులు.

          సమాధానం: ఆముదము గింజ

  1. ఒక గదిలో 32 పాములు వాటి కాపలా రాక్షసుడు.

         సమాధానం: నాలుక

  1. చాచుకొని సావిట్లో పడుకుంటుంది,ముడుచుకొని మూల నక్కుతుంది.

        సమాధానం: చాప

  1. ఊరంతా తిరిగి వచ్చి ఇంటి ముందు ఆగుతాయి.

        సమాధానం: చెప్పులు

  1. ఎంత దానం చేసినా తరగనిది,అంతకంతకు పెరిగేది.

          సమాధానం: చదువు

  1. కానరాని అడివిలో కర్రి ఆవు మేస్తుంది.

         సమాధానం: పేను

  1. గట్టుమీద పోరగాడు ముట్టగానే ఏడుస్తాడు.

         సమాధానం: డప్పు

  1. ఎర్రని కోటలో తెల్లని బటులు.

           సమాధానం: పళ్లు

  1. కోసిన తెగదు, కొట్టిన ఏడవదు.

         సమాధానం: నీడ

  1. ఒకే అగ్గిపెట్టలో ఇద్దరూ పోలీసులు.

         సమాధానం: వేరు శనగ కాయ

  1. చిట్టచివరి కొమ్మలు చిలక గుడ్లు పెట్టింది.

          సమాధానం: నేరేడు పండ్లు.

  1. తలకు తోకకు ఒకటే టోపీ.

          సమాధానం: పెన్ను

  1. అన్ని దేశాలకు, ఇద్దరే రాజులు.

            సమాధానం: సూర్య చంద్రులు

  1. ఒళ్లంతా ముళ్ళు, కడుపంతా చేదు.

          సమాధానం: కాకరకాయ

  1. కన్నీరు కారుస్తాను కానీ, మనిషిని కాను. వెలుగునిస్తాను కానీ సూర్యున్ని కాదు, ప్రాణం పోతుంది కానీ, జీవం లేదు.

         సమాధానం: కొవ్వొత్తి

  1. ముగ్గురు అన్నదమ్ములు, కానీ ఒకరినొకరు తాకలేరు.

          సమాధానం: ఫ్యాన్

  1. ఆ మనిషికి రెండే చేతులు ఏడు కాళ్లు.

            సమాధానం: నిచ్చెన

  1. నేను నడుస్తూనే ఉంటా నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు.

             సమాధానం: కాలం

  1. వీధిరాజుకి కొప్పు ఉంది కానీ, జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు.

            సమాధానం: కొబ్బరి కాయ

  1. అడుగులు ఉన్న కాళ్లు లేనిది? ఏమిటది?

       సమాధానం: స్కేల్

   

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *