10+ Podupu kathalu in telugu/తెలుగు పొడుపు కథలు మరియు సమాధానాలు

  1. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు

 

               సమాధానం-  టెంకాయ

 

  1. ఆకాశంలో పోయే రాక్షసి పక్షి  తొడ పైన కూర్చొని తోడు మాట్లాడు

 

              సమాధానం- పుస్తకం

 

  1. ఇంటికి కంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు

 

                సమాధానం-  దీపం

 

  1. ఈకల ఈరమ్మ ముళ్ల పేరమ్మ సంతకు వెళితే అంతా కొనేవారే

 

                సమాధానం- ఉల్లిపాయ

 

  1. ఊరంతా తిరుగుతాయి నీళ్ళు చూసి భయపడతాయి

 

                సమాధానం-  చెప్పులు 

 

          6.ఎగువ పలక దిగువ పలక పలకల కింద మెలికల పాము

 

             సమాధానం- నాలుక

 

  1. ఎక్కలేని చెట్టుకు గంపెడు కాయలు

 

           సమాధానం-  మిరప చెట్టు

 

  1.   ఏమీ  లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నా అమ్మ అలిగి మనిగి ఉంటుంది

 

             సమాధానం- విస్తరాకు

 

  1. ఒక గూటిలో 32 మంది దొంగలు

 

             సమాధానం- నోటిలో  పళ్ళు

 

  1. ఒక స్తంభానికి నలుగురు దొంగలు

 

           సమాధానం- లవంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *