Telugu Moral Story The Fox And Drum|నక్క మరియు డ్రమ్ము నీతి కథ

Telugu Moral Story The Fox And Drum

nakka drum moral story 1 telugu moral story
Telugu Moral Story The Fox And Drum

అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది యుద్ద వీరులు వదిలిపెట్టి పోయిన ఒక పెద్ద డ్రమ్ము చూసింది. అయితే నక్క ఇలాంటి దాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, దానిని ఆసక్తికరంగా చూడ సాగింది. నక్క డ్రమ్ము చుట్టూ తిరుగుతూ దాని గురించి తెలుసుకోవాలని అనుకుంది, అయితే అనుకోకుండా నక్క డ్రమ్ము మీదకి ఎక్కింది అప్పుడు వెంటనే డ్రమ్ము ఒక పెద్ద శబ్దం చేసింది .ఇది ఒక సమీపంలోని గ్రామ ప్రజలు విని భయభ్రాంతులకు గురి అయ్యారు, వారు అడవిలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడని భావించి భయంతో వారు తమ ఆహారం వస్తువులు అన్నిటిని వదిలి గ్రామంలో నుండి పారిపోయారు.

నక్క బాగా తెలివైన మరియు చురుకైన జంతువు కావడంతో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంది. అది ఆ డ్రమ్మును విడిచిపెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళింది అక్కడ భయంతో పారిపోయిన గ్రామస్తులు వదిలిపెట్టిన ఆహారం మరియు వస్తువులన్నిటిని చూసింది. నక్క ఊహించని ఆహారం సొంతం అవడంతో ఆ విందును ఆనందంగా ఆస్వాదిస్తూ రుచికరమైన ఆహారాన్ని మొత్తం తినేసింది.

10 తెలుగు నీతి కథలు కూడా తప్పక చదవండి ..

ఈ పరిణామం పట్ల చాలా ఆనందానికి గురి అయింది ఇదేదో చాలా బాగుంది, ఇలా నేను ప్రతి రోజు డ్రమ్మును శబ్దం చేసి ప్రతిరోజు ఆహారాన్ని హాయిగా ఆరగించవచ్చని మనసులో అనుకుంది. అయితే నక్కకు కొన్ని రోజులు ఇలా సంతోషంగా గడిచిపోయాయి ,ఒకరోజు అనుకోకుండా నక్క డ్రమ్ము లోపల ఇరుక్కుపోయింది తర్వాత బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. అయినా కూడా లాభం లేకపోయింది అయితే గ్రామస్తులు కొందరు ధైర్యాన్ని కూడగట్టుకొని అడవిలో జరుగుతున్న పరిణామాన్ని చూడడానికి నిర్ణయం తీసుకొని ఆ రాక్షసుడు ఎవరు అని తెలుసుకోవాలని అడవికి బయలుదేరారు .అయితే వారు అక్కడ ఉన్న సన్నివేశం చూసి చాలా మోసపోయామని మనల్ని మోసం చేసింది ఒక జిత్తుల మారి నక్కని వారు గ్రహించారు.

ఈ మోసంతో ఆగ్రహించిన వారు నక్క ను బంధించి అది చేసిన మోసపూరిత చర్యలకు శిక్షిస్తూ, బాగా నక్కను  చితకబాదారు .ఇక ఆ రోజు నుండి నక్క మోసం మరియు దురాశ యొక్క పరిణామాల గురించి ఒక విలువైన గుణపాటాన్ని నేర్చుకుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మోసం మరియు దురాశ ఎప్పటికైనా ఇబ్బంది మరియు హానిని కలిగిస్తాయి. మరియు నిజాయితీగా ఉండటం అలాగే ఒకరి వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందడం , ఎల్లప్పుడూ మంచిది. పిల్లలు ఈ కథ Telugu Moral Story The Fox And Drum మీకు బాగా నచ్చింది అని మేము అనుకుంటున్నాము, ఇలాంటి నీతి కథలను మీ స్నేహితులతో కూడా పంచుకోండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *