Telugu Moral Story The Crow And The Cobra|కాకి మరియు కోబ్రా నీతి కథ

కాకి మరియు కోబ్రా ఇమేజ్ 1 1 Telugu Moral Story
Telugu Moral Story The Crow And The Cobra

Telugu Moral Story The Crow And The Cobra

అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక చెట్టు మీద రెండు కాకులు నివసిస్తూ ఉండేవి. ఇక అదే చెట్టు మీద ఒక నల్ల  త్రాచు పాము కూడా నివసిస్తూ ఉండేది. అది చాలా చెడ్డది, ఎప్పుడు కూడా కాకుల గుడ్లు తినాలి అని అనుకునేది. అయితే ఒకరోజు ఆ కాకులు ఆహారం కోసం బయటకు వెళ్లాయి, అవి తమ గుడ్లను తమ గూడులోనే వదిలేసి వెళ్లిపోయాయి దీనిని గమనించిన పాము నెమ్మదిగా చెట్టుపైకి ఎక్కి ఆ కాకుల గుడ్లన్నీ తిని, ఏమీ తెలియనట్లుగా తిరిగి తన   రంధ్రంలోకి వెళ్ళిపోయింది.

 కొంత సమయం తర్వాత కాకులు తిరిగి వచ్చినప్పుడు అవి వాటి గుడ్లు పోయాయని చూశాయి. అయితే అవి చాలా బాధతో మరియు కోపంగా ఉన్నాయి. తమ గుడ్లను పాము తినేసిందని వారికి తెలుసు. ఎలాగైనా ఈ పాము పీడను వదిలించుకోవాలి అని అనుకున్నాయి

 అయితే వారు తమ స్నేహితుడైన నక్క బావ వద్దకు వెళ్లారు, కాకులు తమ సమస్యను నక్క బావకు తెలియజేసి నక్క బావ యొక్క సహాయం కోరారు నక్క బాధపడకండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇది మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పినట్లు చేయండి అక్కడి నుండి పామును తరిమికొట్టే అవకాశం మీకు వస్తుందని చెప్పింది.

 నక్క ఈ విధంగా చెప్పింది మీరు ఒక మంచి నగరానికి వెళ్ళండి, ఒక సంపన్నమైన ఇంటిని వెతకండి అక్కడ బాగా మెరిసే మరియు అత్యంత విలువైనది ఏదైనా మీ ముక్కుతో దాన్ని ఎత్తుకొని మరియు దూరంగా ఎగురవేయండి .ప్రజలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుసరించేలా చూసుకోండి అప్పుడు మీరు మీ చెట్టు వద్దకు తిరిగి వచ్చి పాము ఉన్నటువంటి రంద్రం దగ్గర ఈ మెరిసే వస్తువును పడేయండి. ప్రజలు వచ్చి దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తారు వారు అప్పుడు పామును చూసి దానిని చంపుతారు. అప్పుడు మీరు ఆ పాము నుండి విముక్తి పొందవచ్చు అని మంచి సలహా కాకులకు నక్క బావ ఇచ్చింది.

 ఈ ఐడియా కాకలకు చాలా బాగా నచ్చింది వెంటనే వారు నక్కకు కృతజ్ఞతలు తెలుపుతూ నగరానికి వెళ్లిపోయారు. కొంతమంది బాగా ధనవంతులైన మహిళలు ఈత కొడుతూ సరస్సు వద్ద తమ విలువైన బంగారు ముత్యాలు వంటి వాటిని ఒడ్డున పెట్టి ఈత కొడుతున్నారు.

 అప్పుడు కాకు లు ఒక మెరుస్తున్న నక్లెస్ ను చూసాయి మరియు వాటిలో ఒకదానిని తన ముక్కుతో తీసుకొని, ప్రజలు కాకులను చూస్తూ ఉండేలా అవి నెమ్మదిగా ఎగురుకుంటూ తమ చెట్టు వద్దకు వచ్చాయి .ప్రజలు కాకులను వెంబడిస్తూ ఆ కాకులు మా నక్లేసు దొంగలించింది పట్టుకోండి అంటూ ఆ కాకుల వెంబడి వస్తూ ఉన్నారు.

కాకులు తమ గూడు ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పాము ఉన్న రంధ్రం దగ్గర నెక్లెస్ ను పడేసింది తర్వాత అవి ఎగిరిపోయి ఒక కొమ్మ వద్ద వేచి చూస్తున్నాయి. ప్రజలు అరుస్తూ వస్తున్న శబ్దం విని పాము తన రంద్రం నుండి బయటకు వచ్చింది అప్పుడు అది ఆ నెక్లెస్ మరియు ఆ మనుషులను చూసింది.

నక్క మరియు డ్రమ్ము మంచి నీతి ని కూడా చదవండి

 ప్రజలు ఆ పాములు చూసి ఇదిగో ఇక్కడ ఒక పాము ఉంది దీన్ని చంపండి చంపండి అంటూ వాళ్ళు కర్రలు ,రాళ్లతో పాము పై దాడి చేసి ,ఆ పాము ను గట్టిగా కొట్టి చంపేశారు. వారు తమ నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పరిణామం మొత్తం దూరంగా నుండి చూస్తున్న కాకులు చాలా సంతోషించాయి. తర్వాత అవి మళ్లీ నక్కకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చాలా తెలివైన వారు మీరు మమ్మల్ని పాము నుండి రక్షించారు. ఇప్పుడు మన ము ప్రశాంతంగా జీవించగలమని మరోసారి నక్క బావకు కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. తర్వాత అవి ఒక కొత్త గూడు చేసుకొని కొత్తగా మళ్లీ గుడ్లు పెట్టి ఆనందంగా జీవించాయి. పిల్లలు మీకు ఈ నీతి కథ Telugu Moral Story The Crow And The Cobra మీ స్నేహితులతో కూడా పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *