కప్పల సమూహం, తప్పక చదవాల్సిన కథ

Telugu moral stories :కొన్ని సంవత్సరాల క్రితం ఒక చెరువులో కొన్ని కప్పల సమూహం నివసించేది.ఈ కప్పలు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి ఉత్సాహపరుస్తూ సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఆ చెరువు చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఆ చెరువు చుట్టూ ఎతైన మొక్కలు మరియు అందమైన పువ్వులు ఉన్నాయి. కప్పలు ఒక పెద్ద ఆకునుండి మరొక పెద్ద ఆకుకు దూకుతూ, తమ రోజులన్నీ సరదాగా సంతోషంగా గడుపుతూ ఉన్నాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆ కప్పల ప్రత్యేకత ఏమిటంటే అవి ఎల్లప్పుడూ సంతోషంగా మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఉదయం ఆ కప్పల సమూహంలో ఉన్న ఒక కప్ప పేరు “లింబ” అనే కప్పకు ఒక కల వచ్చింది ఆ కల ఏమిటి అంటే,ఇంతకుముందు ఏ కప్ప కూడా దూకనంతా ఎత్తుకు దూకాలని కానీ,ఆ జంపు చాలా కఠినంగా అనిపించింది. ఎందుకంటే అది చాలా ఎత్తులో ఉంది. లింబ ప్రయత్నించడానికి కూడా చాలా భయపడ్డది.

లింబ అలా బాధ గా ఉన్నప్పుడు మిగతా కప్పల సమూహం “లింబ” దగ్గరికి వచ్చాయి.అందులో ఒక తెలివైన ,ఆ కప్పల నాయకుడు “ధ్రువ” అనే ఒక ముసలి కప్ప, లింబతో ఇలా అన్నది, నీకు ధైర్యం మరియు అద్భుతమైన పనులు చేయాలి అనే కోరిక బలంగా ఉంది. నిన్ను నువ్వు నమ్ము మరియు నీలోని నీ స్వంత ప్రత్యేక శక్తిని కనుగొను, అని మంచి మాటలు చెప్పింది. ధ్రువ అనే కప్ప మాటల నుండి మంచి ప్రేరేపన పొందిన లింబ ఒక్కసారిగా పెద్ద శ్వాస తీసుకుని దూకడానికి సిద్ధమయ్యింది. అప్పుడు మిగతా కప్పలు నువ్వు చేయగలవు లింబ, నువ్వు ఎలాగైనా చేయగలవు.అని సంతోషకరమైనటువంటి అరుపులతో దానికి ప్రత్యేకమైన ప్రేరణ అందించాయి. అప్పుడు ఎనలేని విశ్వాసంతో లింబ తన శక్తితో గాలిలోకి ఎగిరినాడు. లింబ కాళ్లు నీళ్లలోంచి నెట్టడం వల్ల కప్ప మరింత పైకి వెళ్లేలా చేసింది. ఆపై అద్భుతం ఏదో జరిగినట్టు లింబ అవతల వైపు ఆకుపైన దిగాడు చప్పట్లు హర్షద్వానాలతో చెరువు మొత్తం ప్రతిధ్వనించింది. లింబ కప్ప కేవలం చేసింది ఆ చెరువులోని కప్పల సమూహం నుండి వచ్చిన మద్దతు మరియు నమ్మకం కారణంగా లింబ కప్ప కఠినమైన జంప్ చేసింది. కప్పల సమూహం అవి చేసే ప్రతి పనిలో ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం సవాళ్లను ఎదుర్కోవడం లేదా వారు ఇష్టపడే పనులు చేయడం వంటి వాటిలో, మద్దతుతో అవి ఏదైనా చేయగలవు అని తెలిసింది.

          ఏనుగు మరియు త్రాడు ,నమ్మకం యొక్క పవర్ కథ. తప్పక చదవండి 

మిత్రులారా ఈ కప్పల సమూహం అనే కథ మనకు ఒక చిన్న సహాయం మరియు మనపై నమ్మకం పెడితే ఒక పెద్ద మార్పు వస్తుంది అని బోధిస్తుంది. లింబ కప్పలాగా మనల్ని నమ్మే స్నేహితులు ఉంటే మనందరికీ గొప్ప విజయాలు సాధించే శక్తి ఉంటుంది.మరియు కొన్నిసార్లు ఒకరినొకరు పట్టించుకునే మరియు మద్దతు ఇచ్చే సమూహంలో మనం భాగం కావడం, మన ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మరియు చాలా సరదాగా మార్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *