ఓ టి టి లోకి నివేద థామస్ “35 చిన్న కథ కాదు”..స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందో తెలుసా..

35 చిన్న కథ కాదు OTT Release : కొన్ని సినిమాలు భారీ కలెక్షన్లు కొల్లగొట్టకపోయినా, థియేటర్లలో పెద్దగా అలరించకపోయినా, మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. చూస్తుంది తెరమీద కథ అయినా ఎక్కడో మన జీవితానికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సినిమాలు ఉంటాయి.. అలాంటి మంచి ఆహ్లాదకరమైన చిత్రమే 35 చిన్న కథ కాదు. నివేద థామస్, ప్రియదర్శి వంటి నటీనటులు ప్రధాన పాత్రలో తిరకెక్కిన చిత్రం 35 చిన్న కథ కాదు.

ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంటు ఉన్నటువంటి చిత్రాలు థియేటర్లలో కన్నా ott ప్లాట్ఫాములలో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇలాంటి మంచి చిత్రాన్ని ott ప్లాట్ఫారం అయినటువంటి ఆహా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. దియేటర్లలో మిస్సయిన వారు, తప్పక చూడాల్సిన చిత్రం . ఇది.

ఈ చిత్ర కథా విషయానికి వస్తే ఓ భార్య భర్త వారికి ఇద్దరు పిల్లలు.. పిల్లలే ప్రపంచంగా బతుకుతున్న ఒక కుటుంబం. అందులో ఒక అబ్బాయికి పాఠశాలలో చెప్పే పాఠాలు సరిగా అర్థం కావు. సున్నాకు విలువ లేనప్పుడు అసలు అది ఎందుకు వాడడం అంటూ స్కూల్లో టీచర్లకు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా అరుణ్ అనే అబ్బాయి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టులో చాలా వెనుకబడి ఉంటాడు. దీంతో ఒక సంవత్సరం స్కూల్లో ఫెయిల్ కూడా అవుతాడు. దీంతో తర్వాత తరగతికి వెళ్లాలంటే కనీసం 35 మార్కులు సాధించాలి అని కండిషన్ పెడతారు.

తర్వాత అరుణ్ అనే అబ్బాయి ఈ 35 మార్కులు సాధించాడా అలాగే, తన కుమారుడి భవిష్యత్తు కోసం తల్లి అయిన నివేద థామస్ ఏం చేసింది అనేది ఈ చిత్ర కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *