SBI లో 5280 Circle Based Officer notification 2023:
భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు మొత్తం ఖాళీలు
మొత్తం ఖాళీలు;
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఖాళీలు దేశవ్యాప్తంగా 5280 ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సర్కిల్ కు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో 400 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్ కు సంబంధించి మొత్తం 425 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
విద్యార్హత;
SBI Circle Based Officer ఉద్యోగాలకు విద్యార్హత చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అలాగే మెడికల్ ,ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్ మరియు కాస్ట్ అకౌంటెంట్ చదివిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగానికి అర్హులే.
వయోపరిమితి;
ఇక ఈ ఉద్యోగాలకు 31.10.2023 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము;
OBC అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము RS 750/-.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
జీతము;
RS 36,000- RS 63,840 వరకు ఉంటుంది.
ఎంపిక విధానము;
ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ రూపంలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ రూపంలో మొత్తం 50 మార్కులకు పరీక్షలు ఉంటాయి.. 50 మార్కుల ప్రశ్నలకు సమయం కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది అందులో రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇంగ్లీషులో రాయవలసి ఉంటుంది. తప్పు సమాధానాలకు ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేవు.
తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు;
హైదరాబాదు, విజయవాడ ,విశాఖపట్నం, కర్నూలు మరియు గుంటూరు.
ముఖ్యమైన తేదీలు;
1.ఆన్లైన్లో దరఖాస్తులు అప్లై చేసుకొనుటకు ప్రారంభ తేదీ నవంబర్ 22 2023
2. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకొనుటకు చివరి తేదీ డిసెంబర్ 12 2023
ఇక ఈ పరీక్షలను 2024 జనవరి నెలలో నిర్వహించే సూచనలు ఉన్నాయి. అలాగే అప్లై చేసిన కొన్ని రోజుల తర్వాత అధికారిక తేదీలు వారికి తెలపడం జరుగుతుంది.
NOTIFICATION PDF; DOWNLOAD HERE