HOW TO RANK YOUTUBE VIDEOS
మిత్రులారా యూట్యూబ్ అనే మహాసముద్రంలో మీ వీడియోలు కనుగొనబడడం అంత సులభం అయితే కాదు. కానీ మీరు నిరుత్సాహ పడవద్దు. యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు మీ వీడియోలు ర్యాంకు అవ్వడానికి ఉపయోగపడే కొన్ని విషయాలను ఇక్కడ మేము మీతో పంచుకుంటాము.
Keyword research
ఎంత పెద్ద క్రియేటర్ అయినా కూడా యూట్యూబ్ లో వారి వీడియో కనపడాలి, అంటే వ్యూయర్ అనేవాడు కచ్చితంగా ఒక పదాన్ని search Bar లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి పదాలనే మనం కీ వర్డ్స్ అని అంటాము. ఇవి మన యొక్క వీడియోలు యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్ లో రావడానికి ఉపయోగపడతాయి. మీరు మీ వీడియో కంటెంట్ కి సంబంధించిన కీ వర్డ్స్ కనుగొనడానికి గూగుల్ Keyword ప్లానర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. లేదా మీరు యూట్యూబ్ సెర్చ్ బార్ లో ఆటోమేటిక్ గా టైటిల్సు జనరేట్ అవుతూ ఉంటాయి వాటిని కూడా మీరు ఉపయోగించవచ్చు కీ వర్డ్స్ లాగా.
అదిరిపోయే టైటిల్
ఒక సినిమాకి టైటిల్ ఎంత ముఖ్యమో, మీ యూట్యూబ్ వీడియో కంటెంట్ కి టైటిల్ కూడా అంతే ప్రధానం. మీ టైటిల్ చూడగానే వ్యూవర్ కి అందులో ఏమి ఉంటుందో అనే ఆలోచనను రేకెత్తించాలి. సాధ్యమైనంతవరకు మీ టైటిల్ ని ఆసక్తికరంగా మరియు ఏదో ఒక ఎమోషన్‌ను జోడించండి. టైటిల్ ఒకటి పెట్టి లోపల కంటెంట్ ఇంకోలా చేయవద్దు.ఇలా చేయడం వలన మీ వ్యూవర్స్ ఇంకోసారి మీ ఛానల్ ను చూడడానికి ఇష్టపడడు.
వివరణాత్మక Description
మీ వీడియో ర్యాంకు అవ్వడానికి మీకు ఉపయోగపడే ఇంకొక అవకాశం. అదే యూట్యూబ్ డిస్క్రిప్షన్. అవును ఇక్కడ మీరు మీ వీక్షకులకు మీ వీడియో దేని గురించి చెప్పడానికి చేశారు అక్కడ మీరు వివరించండి. అలాగే డిస్క్రిప్షన్ లో మీ వీడియో కంటెంట్ యొక్క కీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందులో రాయండి. తరువాత కొన్ని కంటెంట్ కు సంబంధించిన tags కూడా యాడ్ చేయండి. తరువాత మీకున్న మీ ఇతర సోషల్ మీడియా లింక్స్ మరియు మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ లింకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.
4.Hashtags
మీ వీడియో రాంక్ అవ్వడానికి సహాయపడే ఇంకొక విషయం ఏమిటంటే హాష్ టాగ్స్. ఈ Hashtags వలన యూట్యూబ్ మీ వీడియో దేనికి సంబంధించినదో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. హాష్ టాగ్స్ ను ఎప్పుడు కూడా ఎక్కువగా Add చెయ్యొద్దు. మీ వీడియోకి కచ్చితంగా సరిపోయే hashtags మాత్రమే ఉపయోగించండి.
5.Thumbnails
యూట్యూబ్ ఒక్కోసారి మీ వీడియోను చాలామందికి suggest చేస్తుంది. అప్పుడు మీరు ఒక మంచి Thumbnail క్రియేట్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా ఆ వీడియోను ఎక్కువమంది క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు thumbnails మీద 100% మీ ఎఫర్ట్ పెట్టండి.
Good content
మంచి కంటెంట్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.మీ వీడియో వినోదాత్మకంగా సమాచారంగా మరియు ఆకర్షణీయంగా ఉండే వీడియోలను చేయండి. ఎప్పుడైతే వీక్షకులు మీ వీడియోలను ఎంత ఎక్కువ సేపు చూస్తే,యూట్యూబ్ అంత ఎక్కువ మందికి మీ వీడియోలు సజెస్ట్ చేస్తుంది. వీడియో మొదలైన దగ్గర నుండి చివరి వరకు ప్రేక్షకులకు ఆసక్తిగా మీ వీడియో ఉండేలా జాగ్రత్త పడండి.
7.Connect with viewers
మీ వీడియోను ఎక్కువమంది లైక్ మరియు కామెంట్ చేసినప్పుడు యూట్యూబ్ దానిని గుర్తిస్తుంది.అలాంటి వీడియోలను వీలైనంత ఎక్కువ వీవర్స్ కు చూపించడానికి ఇష్టపడుతుంది. అంటే ఇది ఎటువంటి సెర్చ్ చేయకుండానే యూట్యూబ్ హోమ్ పేజీలో మీ వీడియోలు ప్రదర్శించబడతాయి. కాబట్టి మీ వ్యూవర్స్ ని లైక్ కామెంట్ మరియు సబ్‌స్క్రైబ్ చేయమని వారిని ప్రోత్సహిస్తూ ఉండండి. మీరు వీడియోలో ఏవో ఒక ప్రశ్నను అడుగుతూ వాటికి సమాధానాలు కామెంట్స్ లో తెలుపమని వారిని కోరండి.
8.video length
మీ వీడియోలు ఎంత సేపు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎక్కువ నిడివి గల వీడియోలు చాలా బాగా ర్యాంకు అవుతాయి. అయితే ఇది ఎప్పుడు అంటే వ్యూవర్స్ మీ వీడియోను చాలా సేపు చూసినప్పుడు మాత్రమే. వారు మధ్యలో వదిలేసిన లేదా స్కిప్ చేస్తూ చూస్తూ ఉన్న మీ వీడియో ర్యాంక్ అవడం కొంచెం కష్టం. కాబట్టి వీడియో మొదటినుండి చివరి వరకు ఆకర్షణీయంగా వీడియో చేయండి.
9.Time
మనం ముందుగా చెప్పుకున్నట్లు యూట్యూబ్ లో మన వీడియోస్ ర్యాంక్ అవ్వాలి అంటే ఒక ఖచ్చితమైన టైం కు అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే మనకు నచ్చినప్పుడు కాకుండా మనం ఒక టైం అంటూ పెట్టుకొని అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటే, యూట్యూబ్ కచ్చితంగా మన వీడియోస్ ను గుర్తిస్తుంది. అలాగే వ్యూవర్స్ కూడా మన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వీడియోస్ ఎప్పుడు పెడతామో తెలియకపోతే వారు మన ఛానల్ పై అంతగా దృష్టి పెట్టరు.
ఇక చివరిగా మన వీడియోలు మంచిగా ర్యాంకింగ్ అవ్వాలి అంటే సరైన keywords ఉపయోగించడం మరియు మంచి టైటిల్స్ రాయడం అలాగే డిస్క్రిప్షన్ లో keywords and hashtags వంటిని ఉపయోగించడం చాలా అవసరం. మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి చూడండి, అలాగే కొంచెం ఓపికతో కూడా ఉండండి పట్టుదలతో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వీడియోస్ రాంక్ అవడం మీరు చూస్తారు.