APPSC GROUP 2 NOTIFICATION:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ మొత్తం 897 ఖాళీల కోసం గ్రూప్ 2 నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ముఖ్యమైన తేదీలు మరియు ఖాళీలు వంటి నియామక వివరాలను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలలో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో కలిపి మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీ 2024 లో జరుగుతుంది అని ప్రకటించింది. ఇక ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది సమయం 150 నిమిషాలు. ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలోకి అనుమతి పొందుతారు. ఇక మెయిన్స్ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది ఇందులో పేపర్ వన్ మరియు పేపర్ టు ఉంటాయి. ఇక ఖాళీల వివరాలు మరియు జీతము అలాగే కమ్యూనిటీ , విద్యార్హత వంటి ప్రమాణాలను ఈనెల 21వ తేదీలోపు తమ అధికారిక వెబ్సైట్లు ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఇక మిగతా సమాచారం కొరకు అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన నోటిఫికేషన్ చదవగలరు.