ఈరోజుల్లో చాలామంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు విపరీతంగా అలవాటు పడిపోయారు అందులో ప్రధానంగా యూట్యూబ్ అనేది చాలా వీక్షకులను కలిగి ఉంది. యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫారం. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి యాడ్ బ్లాకర్లను బ్లాక్ చేస్తుంది. యాడ్ బ్లాకర్లు అనేవి యూట్యూబ్ లో ప్రకటనలు రాకుండా అడ్డుకుంటాయి. అయితే యూట్యూబ్‌లో చాలా వీడియోలు ప్రకటనలతోనే మొదలవుతాయి. ఈ ప్రకటనల నుండి వచ్చే ఆదాయం యూట్యూబ్‌కు మరియు ఆ వీడియోలను క్రియేట్ చేసే క్రియేటర్లకు చెల్లించబడుతుంది. అయితే యాడ్ బ్లాకర్లను ఉపయోగించే వినియోగదారులు ప్రకటనలు చూడరు అంటే యూట్యూబ్ మరియు క్రియేటర్లకు ఆదాయం రాదు అన్నమాట. యూట్యూబ్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు ప్రీమియం సబ్స్క్రైబ్ను ప్రోత్సహించాలని భావిస్తోంది. మీరు యూట్యూబ్ ప్రియం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా యూట్యూబ్ లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూడవచ్చు. అలాగే బ్యాక్ గ్రౌండ్ ప్లే బ్యాక్ మరియు ఆఫ్‌లైన్ వీక్షణ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ad బ్లాకర్లను ఉపయోగించకుండా యూట్యూబ్‌లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలనుకుంటున్న వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం చెల్లించవలసి ఉంటుంది.